హైదరాబాద్ రోడ్లు : గ్లోబల్ ఆశలు, లోకల్ గోతులు
“నాగన్న నడుము విరిగిపోయింది” తన పసుపు నలుపు రంగు ఆటో రిక్షా అద్దం తళ తళ లాడేటట్టు తుడుచుకుంటూ సిరాజ్ మాటవరసకి అన్నట్టు అన్నాడు. రోడ్డు పక్కన రెండు పేపర్లు పరుచుకుని పడుకున్న యాభాయ్యేళ్ళ నాగన్నకు రెండు నిమిషాలు రెస్ట్ కావాలి. ఆ తరువాత ముగ్గురం చాయ్ తాగడానికి వెళ్ళవచ్చు అన్నట్టు సైగ చేసాడు. అసలే బలహీనంగా వుండే నాగన్న మొహం బాధతో ముడుచుకుపోయి ఉన్నది. ఎట్లా జరిగింది అని సిరాజ్ ని అడిగాను. ” ఇంకేం జరుగుతుంది, డ్రైవింగ్!” ఒకింత విసుగ్గా చెప్పాడు సిరాజ్. “ఆ మలక్ పేట మెయిన్ రోడ్డు తెలుసు కదా! ఆ రోడ్డు ఎలక్ట్రిసిటీ లైన్ల
కోసమని గోతులు తవ్వారు. రోడ్డంతా మట్టి కుప్పలు. దానికి తోడు రాత్రంతా వాన. నాగన్న ఆ రోడ్డు మీద పోతుంటే ఏముంది ఒకటే ధడ్ ధడ్ ధడ్. దానితో మన వాడికి నడుము నొప్పి లేచింది. వయసు లో ఉన్నప్పుడు రోడ్డు కంటే మన శరీరం బలంగా ఉంటుంది. వయసు వచ్చే కొద్దీ రోడ్డు బలంగా శరీరం బలహీనం గా తయారు అవుతుంది” అని ముగించాడు సిరాజ్.
ఔను అన్నట్టుగా మూలుగుతూ నాగన్న, చాయ్ కావాలి అని లేచి కూర్చున్నాడు. ముగ్గురం దగ్గరలో ఉన్న ఆదర్శ్ కేఫ్ లో చాయ్ తాగాము. నేను వెళ్లాల్సిన చోటికి దింపుతానన్నాడు, నాగన్న. “వద్దు వద్దు. ఆ రోడ్ మీద నువ్వు బండి నడపొద్దు, నేను వేరే ఆటోలో వెళ్తాను. నువ్వు రెస్ట్ తీసుకో” అన్నాను.
నా మాటలకి అతనికి కోపం వచ్చింది. నా మాటలు పట్టించుకోకుండా విసురుగా అన్నాడు. “శరీరం రోడ్లకి అలవాటు పడుతుంది. ఆ రోడ్డు మరీ అంత అధ్వాన్నం గా ఉన్నది అనుకోలేదు. రోడ్డు అంతా గోతులు. స్పీడ్ గా డ్రైవ్ చేశాను. నేను ఇంతకంటే చెత్త రోడ్లమీద డ్రైవ్ చేశాను ఓల్డ్ సిటీ లో రోడ్లు తెలుసా రోడ్డు, గుంతలు చేతిలో చేయి వేసుకుని నడుస్తుంటాయి. డబ్బున్న మీలాంటి వాళ్ళు వుండే చోట్ల రోడ్ల లాగా ఉండవు. ఆ రోడ్లమీద అయితే నేను పడుకోను కూడా పడుకోగలను. అంత నున్నగా ఉంటాయి. నాగన్న కామెంట్లు రోడ్ల స్థితి గురించి వాటిని మెయింటెన్ చేసే పద్ధతి గురించి బాధతో చేసినవి. సిటీ లో అన్ని రోడ్ల ని ఒకే విధం గా మెయింటైన్ చేయరు. ప్రాంతం ప్రాంతానికి అది మారుతుంది. సిటీలో పేదవాళ్ళకి మౌలిక సదుపాయాల హక్కులు లేవు.
ఇరవై నిమిషాల తర్వాత మేము నాగన్న ఆటోలో అతని బలవంతం మీద ఆ గతుకుల రోడ్డు మీద పాత ఆటోలో ప్రయాణం మొదలుపెట్టాము. రోడ్డు మీద ఆటో ఎత్తెత్తి వేస్తోంది. ఆటోలోది చవకరకం లెదర్ సీటు, నేను వేసుకున్నది షిఫాన్ ప్యాంటు. మాటిమాటికి సీట్ మీద నుంచి జారి పోతున్నాను. ఆ కుదుపుల నుంచి రక్షణ లేదు. నాగన్న మాత్రం తన సన్నటి శరీరం ఎక్కడ సీటు మీద అనకుండా జాగ్రత్త పడుతూ విచిత్రమైన పోజు లో కూర్చుని ఆటో నడుపుతున్నాడు. ఆటో కడ్డీలుపట్టుకుని పడిపోకుండా ఆపుకుంటూ, ” నాగన్నా బొక్కలు ఇరిగిపోతున్నాయ్” అన్నాను.
“ఇంకా బొక్కలు ఎక్కడ ఉన్నాయ్, నా శరీరం లోపల అంతా ఫలుదా లాగా అయిపోయింది” అన్నాడు నాగన్న. ఒక్క నిముషం ఆగి డబ్బు ఉన్నవాళ్లు గాలిలో ప్రయాణిస్తారు. ఈ రోడ్ల మీద కూడా వాళ్ల కార్లలో వాళ్ళ శరీరాలకి కుదుపులే తెలియవు. ధనవంతులు అయితే రోడ్లమీద గోతులు, గుంతలు వాళ్లని ఏమీ చేయలేవు. డబ్బుంటే రోడ్డు బాధలుండవు.
“Naganna’s back is broken” Siraj casually remarks, while wiping the windshield of his shiny black and yellow autorickshaw. Naganna, fifty-seven years of age, is asleep on the side of the street. Lying on two newspapers, he smiles at me, signaling that he needs a couple of minutes before he can join Siraj and me for chai (tea). Naganna’s frail body looks exhausted, and his face is wrinkled with pain. “How did this happen?” I ask Siraj.
“What do you think? Driving, what else?” Siraj snaps back, a tad irritated. After a momentary pause, he continues: “You know that main road in Malakpet area? They are digging the road for some electricity line so there’s just loose gravel on the road… plus after last night’s rains, that whole road is just full of potholes. Our man [Naganna] drove on that road, thud-thud-thud-thud continuously, and now his back is hurting. When you are young, body is stronger than road. When you are old, road is stronger than body!”
Naganna groans in acknowledgement, and slowly sits up, demanding chai. As we drink chai at the nearby Adarsh Café, Naganna offers to drop me to my destination in Malakpet. “No, no, you don’t drive on that road again. I’ll take another auto. Take rest” I insist. He, clearly annoyed, waves his hand in my face dismissing my concern. “The body gets used to it. I didn’t expect the road to be that bad, so I drove fast… I didn’t see all the bumps and potholes. You think this is the worst road I have driven on? Old City and bad roads go hand in hand. Not like the posh area you live in… I would even sleep on those roads, they are that smooth”, he remarks drily. His comment acknowledges bitterly the fact that the quality of road surfaces and their regular maintenance and upkeep are not uniform. Poorer parts of the city just don’t have same infrastructural rights to the city.
Persuaded by his insistence, twenty minutes later Naganna and I are bouncing up and down in his rickety autorickshaw. The sensation of the unevenness of the road is amplified by the hollow skeleton of the autorickshaw. The chiffon pants I am wearing offers no traction to the slippery surface of the faux leather seat I am sitting on, and I keep slipping off it. Naganna has, meanwhile, deftly hoisted his wiry body off the seat. He is crouched almost comically, his backside barely touching the seat. As I try to hold on to the railing in the autorickshaw, I say to Naganna that I feel like my bones are rattling.
“What bones are left, I feel like my insides have become falooda” he responds, referring to the famous slushy creamy dessert. He pauses for a moment and then says with a sad sigh, “Rich people fly. Even on these roads, they just fly in their posh cars. In those cars, you don’t feel these potholes or bumps. I feel that the richer you are, the less you have to feel the road.”
నేను 2017 లో హైదరాబాదులోనా ఫీల్డ్ వర్క్ మొదలు పెట్టాను. చట్టాలను అమలు చేయవలసిన అధికారులు “అరాచకపు” డ్రైవర్లని ఏ విధంగా అదుపు చేస్తున్నారో తెలుసుకోవడం నా ఉద్దేశ్యం. ‘దేశంలో మోటార్ వాహనాలు తిరగటం మొదలు పెట్టినప్పటి నుంచి రోడ్ల మీద ఈ రూల్స్ పాటించని డ్రైవర్ లే కనిపిస్తున్నారు’ (ఆర్నాల్డ్ 2013, గోపకుమార్ 2020). భారతదేశంలోని ఇతర పట్టణాల లాగానే దక్షిణాదిలోని హైదరాబాదు చాలా కొద్ది కాలంలోనే విస్తరించింది. జనాభా పెరిగింది. నాలుగు దశాబ్దాలలో నాలుగింతలు పెరిగింది. 1980 లో 25 లక్షల కంటే తక్కువ ఉన్న జనాభా, 2020 నాటికి కోటికి చేరింది. భారత దేశం లో నయా ఉదారవాదం కేంద్రంగా నగరాల అభివృద్ధి ఒకే మూసలో జరుగుతున్నది. ఒకపక్క ఆకాశాన్నంటుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, షాపింగ్ మాల్స్, ఎక్స్ ప్రెస్ హైవే లు, ఫ్లైఓవర్లు. ఇంకోపక్క అతి సాధారణంగా వినిపించే ఫిర్యాదు హైదరాబాద్ లో డ్రైవింగ్ అనుభవం. ఇది కేవలం చిరాకు పుట్టించే అంశాలే కావు రూల్స్ పాటించని డ్రైవర్లు, దానితో ఏర్పడే ట్రాఫిక్ జామ్ లు హైదరాబాదు విశ్వనగరం గా అభివృద్ధి చెందడానికి “పానకంలో పుడకలు”గా కనపడతాయి. ఈ ఆరాచకాన్ని అదుపు చేయడానికి, క్రమశిక్షణలో పెట్టటానికి ఏవిధమైన పద్ధతులు కావాలి ముఖ్యంగా స్వీయ క్రమశిక్షణ ఎలా సాధించాలి అనేది తెలుసుకోవడం నా లక్ష్యం.
ఈ క్రమశిక్షణ అవకాశాలను నేను పరిశీలిస్తున్నప్పుడు కొన్ని వైరుధ్యాలూ ఎదురు పడతాయని అనుమానించాను. కానీ నగర ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లో గతుకులకు గుంతలకు ఇంత ప్రధాన పాత్ర ఉన్నదని నేను నేను ఊహించలేదు. రోడ్డంతా గతుకులు గుంతలతో నిండి ఉండటమే కాదు వాటి వల్ల కలుగుతున్న ప్రమాదాలు, శారీరక బాధలు,గాయాలు, ప్రభుత్వ బాధ్యత గురించి చర్చ నిత్యం జనం సంభాషణల లో భాగమై పోయాయి. నాగన్న తో జరిగిన సంభాషణ ఇందుకు ఒక ఉదాహరణ .
రోడ్లమీద అసంఖ్యాకంగా ఉన్న గోతులని ప్రభుత్వమే కాదు పట్టణీకరణ అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మౌలిక సదుపాయాలని ఎవరు అనుభవిస్తున్నారు అనే విషయం అర్ధం చే సుకోవడం లో రోజు వారీ అనుభవాల ప్రాధాన్యతని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒక ముందడుగు (చూడండి : ఆనంద్ 2017, ఆనంద్, గుప్త యాపిల్,2018, గోపకుమార్ 2020). ముంబైలోని రోడ్లమీద గుంతల గురించి మానవ శాస్త్రవేత్త హారీస్ సోలమాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రోడ్లమీద గుంతలు మౌలిక సదుపాయాల్లో అంతరాయాలు. “ఈ అంతరాయాలు, అడ్డంకులు, రోడ్లు పాడయిపోవడం ట్రాఫిక్ వల్ల అని, ఏవో తప్పుల వల్ల అని కాకుండా అసలు ప్రయాణ సారాంశమే అవరోధాలు అని అర్ధం చేసుకోవాలి.
ఈ అడ్డంకులు అనేవి సంకల్పిత లక్షణాలే కానీ అసంకల్పిత పొరపాట్లు కావు. కావు. ఈ వ్యాఖ్య చేస్తూ ఆయన ” అవరోధాలు అనుకోకుండా సంభవించిన పొరపాట్లు,అనాలోచిత దోషాలు, వ్యవస్థ వైఫల్యం (గ్రాహం 2010, 2021 లో సోలామాన్ కోట్ చేశారు) అనే వ్యాఖ్యని వుదాహరిస్తూ దానికి బదులుగా ” గోతులు ఏర్పడతాయి, మళ్ళీ మళ్ళీ పుడతాయి. గోతులవల్ల మరణాలు సంభవిస్తాయి, దెబ్బలు తగులుతాయి. జీవన క్షీణత మధ్యనే జనాలు పుడుతూ ఉంటారు” (సోలోమన్ 2021:8)
In 2017, I began to do fieldwork in Hyderabad with a view to exploring how law-enforcement officials were attempting to discipline the “unruly driver”: a trope that has animated popular representations of the Indian street since the early days of motorization in the country (Arnold 2013; Gopakumar 2020). Like many Indian cities, the southern metropolis of Hyderabad has witnessed rapid spatial and demographic growth. Its population has increased fourfold in four decades, from less than 2.5 million in 1980 to more than 10 million in 2020. Such growth has resulted in a familiar pattern of Indian neoliberal urban development centred around “world-class” aspirations: high-rise IT towers, gated communities, shopping malls, flyovers and expressways. At the same time, one of the most common complaints in Hyderabad is that of the experience of driving. More than a nuisance, the rule-breaking driver (and accompanying chaotic traffic) often appears as a bee in the bonnet in the project of making Hyderabad a “world class” city. And so, my intention was to unpack the modes of governance through which this unruliness could be subject to disciplining – and ideally, self-disciplining.
I suspected that, along the way, I would uncover a few contradictions of that fraught process. Little did I expect to encounter the humble pothole as a protagonist in the riveting drama of urban traffic. Potholes appeared all around not just in terms of their pervasive presence on pockmarked streets, but also in everyday conversations around bodily risk and injury, and the role of state responsibility. The conversation that I had with Naganna is but an example of the myriad ways in which potholes made their way into seemingly mundane discussions around driving in Hyderabad.
While the pervasive pothole has, in a sense, been doubly neglected – not just by government officials but also by scholars who study cities – recent work that call to take the experience of infrastructures seriously is a step towards thinking through the vitality of mundane encounters in urban life (see Anand 2017; Anand, Gupta & Appel 2018; Gopakumar 2020). In a provocative article on potholes in Mumbai, anthropologist Harris Solomon thinks through potholes as infrastructural disruptions and argues that “rather than casting disruptions as movement’s antithesis and error, disruption might be understood as an essence of movement. Disruption is a feature, not a bug, in the movements of everyday life” (2021: 3). In making this uncommon claim, Solomon departs from traditional approaches to thinking about “disruptions of infrastructures as unexpected aberrations or unplanned errors or systemic failures” (Graham 2010, cited in Solomon 2021). Instead, he notes that “potholes are a matter of possibility, something generative… As potholes generate death and injury, publics emerge through life’s erosion” (Solomon 2021: 8).
ఈ కొత్త ఆలోచనలే నన్ను నిత్యనూతన సమస్యగా ఉన్న గోతులు,గతుకులు పట్ల ఆసక్తి రేకెత్తించాయి. పట్టణాల్లో మౌలిక వసతుల పరిస్థితి లో, రాజకీయ ఆసక్తులలో ఈ గుంతల పాత్ర ఏమిటి అనేది మరింత అర్థం చేసుకోవాలి అనుకున్నాను. ” రోడ్డు మీద శరీరానికి కలిగే అనుభవాలు ఆధారంగా చేసే విమర్శ మూలాధార సామాజిక రాజకీయ వ్యవస్థల మీద గాక , ప్రత్యక్ష, ప్రమాద కారక అంశాల మీద ఆధారపడుతుంది మౌలిక వసతులలో ఉన్న అసమానతలు అర్థం చేసుకోవాలి.” జోనాథన్ అంజారియా (2020:269) చేసిన ఈ వాదనను కొనసాగిస్తూ, అక్షరాలా రోడ్డుమీద కలిగే శారీరక అనుభవం మీదే ఆధారపడే పౌరులు నగర అభివృద్ధి లో ఉన్న అసమానతలను, శుష్క రాజకీయ వాగ్దానాలలోని డొల్లతనాన్ని, ట్రాఫిక్ చలాన్లు వేయడం లో ప్రభుత్వానికి నైతిక హక్కు లేకపోవడాన్ని అర్థం చేసుకుంటారని నేను చెప్పబోతున్నాను.
కదిలిపోతున్న ఎముకలు బలపడుతున్న అనుమానాలు
నా ఇంటర్వ్యూలో పదేపదే ప్రస్తావనకు వచ్చిన విషయం రోడ్ల వల్ల కలుగుతున్న గాయాలు, బాధలు. ఆటో డ్రైవర్ నాగన్న ఎక్కువ సేపు రోడ్ల మీదే గడుపుతాడు. రోడ్డుమీద హఠాత్తుగా వచ్చే కుదుపుల వల్ల శరీరం ఎంత షాక్ కి గురిఅవుతుందో నాగన్నకి తెలుసు. మనం ప్రయాణిస్తున్న బండి కి రోడ్డుకి ఉన్న సంబంధం తెలుసు. రోడ్డు మీద ఉన్న అసమానతలు కేవలం రోడ్డువే కావని నగరాల అభివృద్ధిలోని అసమానతలు అన్నది ఆటో రిక్షా నడిపే నాగన్నకు అభిప్రాయం కాదు, తాను అనుభవించే శారీరక మైన కష్టం వల్ల తెలిసిన నిజం.
నగరంలో రోడ్లు ఎక్కడ ఎట్లా ఉంటాయో చెప్పుకోవడం కూడా అసమాన అభివృద్ధి గురించి మాట్లాడటమే. ఉదాహరణకి తళతళలాడే మెట్రోలో ప్రయాణించడం అంటే గోతులు ఉన్న రోడ్డు మీద కాక అక్షరాలా ఆకాశమార్గాన ప్రయాణించడమే. మెట్రోలో ప్రయాణం మెత్తగా సాఫీగా ఉంటుంది. రోడ్లు మాత్రం ఎత్తు పల్లాలతో ఎగిరెగిరి పడుతూ ఉంటాయి.
సిటీలో బైక్ మీద తిరిగే 30 ఏళ్ల బిజినెస్ మాన్ అరవింద్. ఆయన మాటల్లో
…”తళ తళ మెరిసిపోయే మెట్రో చూడండి, షాపింగ్ మాల్స్ చూడండి, హైటెక్ సిటీ చూడండి, గూగుల్ ఆఫీస్ చూడండి, అది ఇది అన్నీ చూడండి. ఆ తర్వాత రోడ్డుమీద బైకు నడుపుతుంటే కానీ మన శరీరానికి కుదుపులు తెలియడం మొదలు అవదు. అప్పుడు మనకి అర్థమవుతుంది మన అభివృద్ధి చాలా దూరంలో ఉన్నది అనీ, అభివృద్ధి రోడ్డంతా గోతులు గతుకులు అని.”( ఇంటర్వ్యూ- ఆగస్టు 2018)
ఎగుడు దిగుడు రోడ్లు మొత్తం నగర అభివృద్ధికే నిదర్శనాలుగా తయారయ్యాయి. విశ్వనగరానికి సాఫీగా చేసే ప్రయాణంలో ఈ గతుకుల, గోతుల రోడ్లు అడ్డంకిగా మారినట్లు ఉన్నది. అల్పాదాయ వర్గాల కీ మధ్య తరగతి వారికి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రాజ్యం ఎంత నమ్మదగినది కాదో అర్థమవుతుంది. రోడ్ల మీద గుంతలు బహిరంగ రహస్యాలకి ఉదాహరణలు. అవి మరిన్ని రహస్యాలను బయట పెడతాయి. ఇటువంటి బహిరంగ రహస్యాల గురించి మరికొంత సమాచారం కోసం వారిని పదే పదే ప్రశ్నిస్తే దాదాపు ఒకే రకం అభిప్రాయం వినపడ్డది. ప్రభుత్వాల మీద తీవ్రమైన అనుమానమే ఆ అభిప్రాయం.
30 ఏళ్ల టాక్సీ డ్రైవర్ ఆరీఫ్అభిప్రాయం ఇది….”
“ఈ విషయం అందరికీ తెలిసిందే. కాంట్రాక్టర్ రోడ్లు తొందరగా పాడయి పోయేటట్లు వేస్తారు. ఆ రోడ్లు బాగుచేసేందుకు మళ్ళీ కాంట్రాక్టు వాళ్ళకే వస్తుంది. అందరికి ఎవరి వాటాలు వాళ్ళకి వస్తాయి. కిక్ బాక్స్. ఇదంతా ఒక పెద్ద బిజినెస్”
గవర్నమెంటు ఈ విషయం ఎందుకు పట్టించుకోదు అని అడిగాను. చాలా సింపుల్ గా చెప్పాడు జవాబు- ‘అవినీతి’
హైదరాబాదీలోనూ, లోకల్ మీడియాలో కూడా ఈ అవినీతి పట్ల అవగాహన స్పష్టంగా ఉన్నది. నేను ఇంటర్వ్యూ చేసినవాళ్ళు ఎవ్వరూ కూడా రోడ్లు మాత్రమే రాజకీయ అవినీతికి ఫలితం అనుకోవడం లేదు. రోడ్ల మీద డ్రైవ్ చేస్తుంటే అవినీతిని శరీరం అనుభవిస్తుంది. ప్రభుత్వపు అవినీతిని రోడ్లు రోజు గుర్తు చేస్తూ ఉంటాయి. గోతులతో నిండి ఉన్న రోడ్లు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నది అనే అనుమానాన్ని నిజం చేస్తాయి. నితిన్ ఒక టెక్కీ. వారాంతపు సెలవులలో ఒక ఫుడ్ డెలివరీ ఆప్ కి పని చేస్తాడు. అతను అంటాడు. ” రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్న ప్రతిసారీ ప్రభుత్వ అవినీతి అనుభవంలోకి వస్తుంది ఆ విషయం తెలుసుకోవడానికి న్యూస్ పే పర్లు చదవాల్సిన అవసరం లేదు”.
గోతులు గతుకులు ప్రమాదాలకు ఏజెంట్లు
అడుగడుక్కీ ఉండే గోతులు ఖరాబు రోడ్లు అన్ని చోట్లా, రోజు ఉండేవే కానీ ఒకరోజు అవే గోతులు ప్రాణాంతకం అవుతాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్లకి. నేను నా ఫీల్డు వర్క్ 2018 జనవరిలో మొదలుపెట్టాను. అప్పుడు ఒక ఇరవై రోజుల వ్యవధిలో మోటార్ సైకిల్ నడిపే వారు ముగ్గురు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. మూడు యాక్సిడెంట్లకీ కారణం రోడ్లమీదవున్న గుంతలే. మొదటి ప్రమాదం లో బైక్ గోతిలో పడింది. వెనకాల కూర్చున్న వ్యక్తి ఎగిరి కింద పడ్డాడు. తల రోడ్ డివైడర్ కి తగిలింది. రెండవ యాక్సిడెంట్లో బైకు ముందర ఆగివున్న బస్సును గుద్దుకుంది. ఆ బస్సు ముందువున్న గోతి లో పడకుండా తప్పించుకోవడానికి సడెన్ గా బ్రేక్ వేశారు. మూడవ యాక్సిడెంట్ లో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి గోతిలో పడకుండా చేసిన ప్రయత్నంలో డివైడర్ కు గుద్దుకున్నాడు.
వింటున్న కొద్దీ ఇటువంటి మరణాలు చాలా జరుగుతున్నాయని నాకు అర్థమయింది. నిజానికి 2013 నుంచి 2018 దాకా 15 వేల మందికి పైగా ఈ గోతుల వల్ల జరిగిన ప్రమాదాలలో మరణించారు. సుప్రీంకోర్టు కు సమర్పించిన ఒక నివేదికలో ఈ విషయాన్ని చూసిన ఒక జడ్జి (థిల్లాన్2018) టెర్రరిజం కంటే ఈ గోతులే ఎక్కువ ప్రమాదకరం గా ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. సమాచారం ఏవిధంగా సేకరించారు అనే విషయంలో భేదాభిప్రాయాలువున్నా కూడా జనంలోను కోర్టులోనూ కూడా గోతుల వల్లే ఈ మరణాలు సంభవించాయి అనే అభిప్రాయమే జనంలో ఉన్నది. గోతుల వల్లే ప్రమాదం జరిగిందని ప్రాణం పోయిందని నిరూపించడం అంత తేలిక కాదు. పోలీసు అధికారుల అభిప్రాయంలో గోతుల వల్ల ప్రమాదాలు జరుగుతాయి కానీ ప్రాణాపాయం సంభవించదు, ప్రాణం పోవడం మాత్రం బండి నడుపుతున్న వాళ్ళు కానీ వెనక కూర్చున్న వాళ్లు కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లకానీ , పెట్టుకున్న హెల్మెట్లు నాణ్యమైనవి కాక పోవడం వల్లమాత్రమే జరుగుతున్నది. రోడ్లమీద గో తుల వల్ల జరిగే ప్రమాదాలలో తప్పు మీదంటే మీది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రభుత్వం ప్రజలు నిందలు మోపుకుంటున్నారు. గోతులు అందరికీ ఇబ్బంది కలిగిస్తాయి. ఎటువంటి బండ్లు అయినా పడాయిపోతాయి. కానీ గోతుల వల్ల చనిపోతున్నది మాత్రం ద్విచక్ర వాహన ప్రయాణీకులే, నడుపుతున్న వారయినా, వెనుకకూర్చున్న వారయినా. హైదరాబాద్ లోని వాహనాల సంఖ్యలో నూటికి 80, మోపెడ్లు,మోటార్ బైక్ లు, సైకిళ్ళే. అందుకే, ద్విచక్ర వాహన ప్రయాణీకుల ప్రాణ భద్రత ప్రాధాన్యం యిచ్చి పట్టించుకోవసిన అంశం.
It is precisely this call to thinking about the troublesome generativity of potholes that I turn my attention towards. In this essay, I probe the several other ways in which potholes mediate infrastructural dispositions and political subjectivities in cities. Building on Jonathan Anjaria’s argument that “emphasising embodied experiences of the road allows for a critique of infrastructure that does not rely on exposing an underlying social and political system, but on seeing the potential in what is immediately ‘apprehensible’” (2020: 269), I show how the sensation of road surfaces and become, quite literally, the terrain on which citizens evaluate the unevenness of urban development, the myriad hypocrisies of political promises, and the moral legitimacy of the state to impose traffic penalties.
Rattled Bones, Resilient Suspicions
The constant invocation of bodily injury and pain with reference to bad roads was a ubiquitous trope in my interviews. Driver-workers like Naganna, who spent most of their time on the road, were particularly vocal about how a sudden bump in the road could shock the body and, further, how so much of this sensory engagement with unevenness depended on the kind of vehicle one was driving. Autorickshaw drivers like Naganna certainly felt – not just in terms of their “attitudes” towards the state but really felt – the unevenness of the roads acutely reflected the more general unevenness and inequality that attended the city’s hyper-development.
The sensory landscape of the city also often became a matter of commenting on the unfinished business of development. For instance, travelling by the shiny new metro that snaked its way through the city sky afforded one the ability to (literally) rise above the pockmarked streets below. The metro felt smooth and seamless, while the roads remained bumpy. In the words of Aravind, a businessman in his 30s and an avid biker in the city:
Look at our shiny metro, look at our malls, look at our HiTech City, look at our Google office, Microsoft office, this and that…But then you drive, and when your body feels those jerks on the road, you realize we still have such a long way to go. Our road to development is filled with potholes, looks like. (Interview, August 2018)
The bumpy road comes to become a synecdoche of the city at large – the supposedly smooth drive towards “world-class” development being interrupted by potholes. For low-income and middle-class drivers alike, the unevenness of the roads made sense when one was cognizant of the workings of an untrustworthy state. Potholes were, in fact, a window into the treasure trove of public secrets. When I did press them for more information about these types of “public secrets,” I often heard similar stories that revealed deep-seated suspicions of the state.
For example, Arif, a taxi driver in his 30s, said: “Everyone knows that contractors build roads that get damaged easily so that they can get another contract to repair the same road. Everybody gets kickbacks. It is all a big business.”
“Why would that not be taken to task by the government?” I asked him.
He swiftly responded with a simple explanation: “Corruption.”
This lucid account circulates with startling ease amongst Hyderabadis and local media. It is not as if my interlocutors only associated roads as being the outcome of systematic political corruption. Rather, simply driving in the city becomes an experiential, everyday reminder of state corruption. Indeed, the bumpy road even validates suspicions of the state as corrupt. As Nitin, a techie who also drives for a popular food delivery service on weekends, was to tell me: “Every time one drives on the road, one is reminded of how corrupt the government is. You don’t even have to read the papers to know that! Just drive.”
Potholes as Agents of Injury
The omnipresent potholes and kharaab [i] roads were everywhere but, on some days, those same potholes turned deadly, especially for riders of two-wheelers. When I started fieldwork in January 2018, the city was reckoning with the fact that, within a span of just 20 days, three motorized two-wheeler riders had died in road accidents that were directly attributed to the existence of potholes. In the first, a pillion-rider [ii] fell off the back of a motorbike after driving over a pothole and hit his head on the road divider; in the second, a motorcyclist hit the back of a bus, which braked suddenly to avoid driving over a deep pothole; and in the third, a rider of a scooter hit a divider on the road while trying to swerve to avoid a pothole.
Over time, I realized such stories are actually quite common. In fact, a 2018 report furnished to the Supreme Court of India suggested that more than 15,000 people had died between 2013 and 2018 due to potholes, prompting a judge to remark that potholes seem to be deadlier than terrorism (Dhillon 2018). While we could debate the methods of data collection, my point is that in popular narratives and even court rhetoric, potholes caused the deaths. Fixing the blame of an accident on a pothole, however, was not that simple. From the perspective of police officials, a pothole alone seldom causes deaths. According to state officials, while potholes did cause accidents, deaths were often the result of motorists or people sitting behind them not wearing helmets, or wearing helmets that were substandard.[1] This oscillating blame-game between the state and the citizen animated discussions around pothole-accidents.
ఈ విషయం అంతా ప్రభుత్వ అవినీతి గురించిన చర్చ కాదు. గోతుల వల్ల జరుగుతున్న మరణాలు అంతకుమించిన వ్యక్తిగత సమస్య. ప్రభుత్వ అవినీతి అందరికీ తెలిసిందే. అదేకాక ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు పోయినప్పుడు ప్రభుత్వ వ్యవహరించే తీరు అన్యాయంగా ఉంటోంది. ట్రాఫిక్ పోలీసులు తమని తాము రక్షకభటులు గా చెప్పుకుంటారు మరీ ముఖ్యంగా డిజిటల్ కమ్యూనికేషన్ లో హష్ టాగ్ ’ వి కేర్ ఫర్ యు’ అని ఉంటుంది మీ రక్షణ మా బాధ్యత అని ప్రచారం చేసుకుంటారు ఈ సందేశానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది రోడ్ల పరిస్థితి. ఉదాహరణకి సతీష్ పరిస్థితి చూడండి. ఆయన 10 సంవత్సరాల నుంచి బైక్ నడుపుతున్నాడు. ఇప్పుడు డాక్టర్ ఆయనకి బైకు నడపవద్దు అనిసలహా ఇచ్చారు.
గోతులతో ఉన్న రోడ్లు వాటికి సంబంధించిన అధికారులకు ఏ విధమైన బాధ్యత లేదనడానికి నిదర్శనాలు. వాళ్లు రోడ్లమీద భద్రత గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు నిజంగా పట్టించుకునే వాళ్ళ అయితే ఈ రోడ్ల గురించి ఏమైనా చేయరా. ఈ బ్యాడ్ రోడ్ల వల్ల నా వెన్నెముక దెబ్బతిన్నది. నేను రోజు హెల్మెట్ పెట్టుకుంటాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నది. నేను అన్ని రూల్స్ పాటిస్తాను. కానీ చివరికి ఏమైంది ఈ బాడ్ రోడ్ల వల్ల నా వెన్నెముక దెబ్బతిన్నది. (ఇంటర్వ్యూ ఫిబ్రవరి 2018).
కళ్ళకు కనిపిస్తున్న రోడ్డు భద్రత గురించి మాట్లాడుతూనే సతీష్ ప్రభుత్వ బాధ్యత లైన రక్షణ, సౌకర్యాల కల్పన గురించి మాట్లాడుతున్నాడు. 2021 ఏప్రిల్ లో ఈ గోతుల బారినపడి వెన్నెముక దెబ్బతిన్న ఒక వ్యక్తి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కి ఒక వినతి చేశారు. ఆ వినతిలో అతను రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 లోని జీవించే హక్కుని ప్రస్తావిస్తూ రోడ్లమీద గోతులు ” నాజీవించే హక్కును హరించి వేస్తున్నాయి. భారత రాజ్యంగం లోనిఆర్టికల్ 21 కింద స్వచ్ఛమైన పర్యావరణం కూడా నా జీవించే హక్కులో భాగమే” అని పేర్కొన్నారు(నానిశెట్టి 2021) రోడ్ల మీద గోతులు మరణాలకి, గాయాలకి, ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనాలు ఇవి. రోడ్డు భద్రత మీద రెండు నాలుకల డొల్ల మాటలని బయటపెడుతున్నాయి.
హైదరాబాద్ లో ఈ రోడ్ల పరిస్థితి గురించి వివిధ రకాల స్పందనలు వినిపిస్తాయి. పూర్తిగా పట్టించుకోకుండా వుండటం దగ్గరనుంచి తీవ్రంగా చిరాకుపడటం దాకా, చురుక్కుమనే రాజకీయ విమర్శనుంచి హైద్రాబాద్ కే సొంతమైన జోకులదాకా ఈ స్పందనలు ఉంటాయి. గోతుల రోడ్లమీద, వాటి చుట్టూ డ్రైవ్ చేయడం మనుషులు నేర్చుకుంటున్నారు. ప్రజల భావాలలో మాములువైన గోతులు మాత్రం సాధారణ స్థాయినుంచి నగర రంగస్థలం మీద ప్రధానమైన దృశ్యాలు గా మారాయి.
ఎగిరెగిరి పడే రోడ్లు నగరం గురించి ఒక ప్రత్యేకమైన ఎరుకని కలిగిస్తాయి. ఈ ఎరుకతో గోతుల మీద నిరాశ, అది లేకపోవడమే కాక నగరమంతా విస్తరించి ఉన్న గోతుల చుట్టూ అనేకానేక అభిప్రాయాలు వినపడతాయి. యాపిల్, ఆనంద్, గుప్తా చెప్పినట్టుగా మౌలిక వసతులనేవి ఉన్నయ్యో లేవో అన్న సత్యం ప్రయత్నించి గ్రహించేది కాదు. ‘అది శరీరానికి గుచ్చుకుని’ మరీ గ్రహింపచేస్తుంది. ఫలితంగా, మౌలిక వసతులు ప్రభుత్వాన్ని గురించి ఒక అంచనా వేయడానికి పనికి వచ్చే విషయాలుగా మారతాయి. అంతగా ప్రాధాన్యత లేనివిగా, తాత్కాలికమైనవిగా కనిపించే రోడ్డు అవరోధాలు రాజకీయ విషయాలుగా మారతాయి.
గోతులు గతుకులతో నిండి ఉన్న రోడ్లు ప్రపంచమంతా ఉన్నాయి మూడో ప్రపంచ దేశాల నగరాలు శిథిలత్వానికి కారణాలుగా ప్రత్యేకించి నమోదు చేయనక్కరలేదు (అన్వర్, సుర్ 2020) . ఈ వ్యాసం రాయడం లో ఉద్దేశ్యం దక్షిణార్థ గోళం లోని నగరాలలోని రోడ్ల పరిస్థితి గురించి రాయడం కాదు, ఆ రోడ్ల నుంచి రాయడం. ఆ రోడ్ల మీద వచ్చే కుదుపులు, ఎగిరేగిరిపడటాలు, అడ్డంకులు గురించి రాయడం. రోడ్డు ప్రయాణం లో కలిగే కుదుపులాతో, శారీరక అనుభవాలలో ఈ మామూలు గొయ్యే, భారతదేశపు పట్టణ జీవితం లోని కోరికలు, నిరాశలు, ఇబ్బందులను చూపించే దర్పణంగా తెరుచుకుంటుంది.
But going beyond charging the state with being corrupt, there was something more immediate and personal about pothole deaths. The argument was something like this: not only was the state corrupt – something everyone knew – but, worse, it operated hypocritically, even in the face of widespread injury and death. While the traffic police kept referring to themselves as “caring” agents of the state – most notably manifested in the hashtag “#WeCare4U” that they used in digital communication – the state of the roads was interpreted and experienced as contradicting this very message. For instance, Satish, who has been riding a motorcycle in the city for over a decade had to give it up on doctor’s recommendations. According to him:
The pothole-ridden roads are just a reflection of the fact that the concerned authorities do not care. They keep talking about road safety, but if they really cared, would they not do something about these roads? My spine had been damaged because of the bad roads. I wore a helmet every day, I have a driver’s license, I follow all rules. But ultimately, it’s the bad roads that got me. (Interview, February 2018)
Here Satish invoked the state’s responsibility to care and to provide, alongside making reference to the more visible and voluble story of road safety. Similarly, in April 2021, a citizen who had suffered a spinal injury due to a pothole submitted a plea to the Telangana State Human Rights Commission in which he invoked the Right to Life guarantee under Article 21 of the Constitution of India, arguing that the prevalence of potholes on the roads are “violating my right to life which includes right to a clean environment under Article 21 of Indian Constitution” (Nanisetti 2021). The literal ruptures on road surfaces are constructed as agents of death and injury and become experiential reminders of a neglectful state. They exposed the moral double standards of the rhetoric around road safety.
In Hyderabad, potholes engender a variety of responses – from blasé resignation to sharp irritation to trenchant political critiques to culturally-intimate humor. While people move on and around potholes, potholes too move from occupying a banal and mundane presence in public discourse to becoming spectacular sites of urban drama. The very bumpiness of the road surface enables a particular knowledge about the city and come to occupy a space not of despair or lack but rather of excess – an excess of discourses centred around their insistent presence as one moves around the city. As Appel, Anand, and Gupta (2018: 22) point out, infrastructures are not just sensed but that they “press into the flesh” and, in doing so, become an intimate site of the evaluating the state. These seemingly insignificant and apparently ephemeral interruptions constitute political subjects.
While potholes are, indeed, found everywhere around the world and need not be written about in the register of the decay and collapse so often associated with cities of the Global South (see Anwar and Sur 2020), this essay was an attempt to not just write about roads in the Global South but from them [iii] – from their jolts, bumps, and pauses. In foregrounding sensation and sensory engagements that constitute mobile navigations, the banal pothole becomes an aperture through which to view the desires, discomforts and disappointments animating life in urban India.
[i]. “Kharaab” means “bad.”
[ii] A pillion is a secondary seat for a passenger behind a motorcyclist or moped rider.
[1] Potholes were an inconvenience to everyone and led to the wear and tear of vehicles, no matter what vehicle was being driven, but potholes almost always only killed two-wheeler riders and/or their passengers. However, given that over 80% of Hyderabad’s vehicular population is comprised of two-wheelers – mopeds, motorcycles, and bicycles – potholes and their complicity in taking the life of a two-wheeler rider/passenger is a matter of much public concern.
[iii] I borrow Gautam Bhan’s thinking when he writes about the turn in writing about cities of the Global South: “writing from these places than about them” (Bhan 2019: 642)
References
Anand, Nikhil, Akhil Gupta, and Hannah Appel, eds. 2018. The Promise of Infrastructure. Duke University Press, 2018.
Anand, Nikhil. 2017. Hydraulic city: Water and the infrastructures of citizenship in Mumbai. Duke University Press.
Anjaria, Jonathan. S. 2020. Surface Pleasures: Bicycling and the Limits of Infrastructural Thinking. South Asia: Journal of South Asian Studies, 43(2), 267-280.
Anwar, Nausheen. H., & Sur, Malini. 2020. Keeping cities in motion: an introduction to the labours of repair and maintenance in South Asia. Economic and Political Weekly, 55 (51), 31-33.
Appel, Hannah, Nikhil Anand and Akhil Gupta. 2018. “Introduction: Temporality, Politics, and the Promise of Infrastructure” (1-38) in Anand et al (eds.) The Promise of Infrastructure. Duke University Press.
Arnold, David. 2012. The Problem of Traffic: The street-life of modernity in late-colonial India. Modern Asian Studies, 46(1), 119-141.
Bhan, Gautam. 2019. “Notes on a Southern Urban Practice.” Environment and Urbanization 31(2): 639–54.
Dhillon, Amrit. 2018. “’More deadly than terrorism’: potholes responsible for killing 10 people a day in India’ The Guardian (24 July). URL: https://www.theguardian.com/world/2018/jul/25/more-deadly-than-terrorism-potholes-responsible-for-killing-10-people-a-day-in-india (last accessed: 7 November 2021)
Gopakumar, Govind. 2020. Installing Automobility: Emerging Politics of Mobility and Streets in Indian Cities. MIT Press.
Nanisetti, Serish. 2021. “Human rights Panel moved over pothole peril.” The Hindu (April 12)
Solomon, Harris. 2021. Death traps: Holes in urban India. Environment and Planning D: Society and Space, 0263775821989700.
Featured Image
అడుగడుగున గొయ్యుంది, ఫోటో: సాయితేజ సౌజన్యం తో
Potholes in Hyderabad. Photo by Saitezaa (@ActivistTeja on Twitter). Used with permission.
Acknowledgements
I thank all my interlocutors who took time out of their busy lives to talk to me and the several citizen-activists who so insistently and passionately talk about road safety and civic issues. I am particularly grateful to SaiTezaa (@ActivistTeja on Twitter), whose photograph of potholes I have shared in this essay and to Sudha Goparaju for translating the essay into Telugu. While ‘road doctor’ Gangadhar Katnam’s own efforts on fixing potholes in Hyderabad did not appear in this essay, conversations with him have inspired my thinking about potholes in the city. Finally, thanks so much to Malini Sur and Liam Magee for making this essay the best version of itself and to Jeffrey Parker, Jonathan Anjaria and Indivar Jonnalagadda for thinking with me along the way.
Disclaimer: Translated into Telugu by by Sudha Goparaju. Issues journal shall not be responsible for any inaccuracies or errors, both direct and indirect, in the translation. If any questions arise concerning the accuracy of the information presented by the translated version, please refer to the English content of the same.